![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -693 లో.....అప్పు, కళ్యాణ్ ఇద్దరు కలిసి రెడీ అయి హాల్లోకి వస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు. నీతో పాటు కళ్యాణ్ ని కూడా స్టేషన్ కి తీసుకొని వెళ్తున్నావా అంటూ స్వప్న అడుగుతుంది. అదేం లేదు తను మ్యూజిక్ డైరెక్టర్ ని కలవడానికి వెళ్తున్నాడు. దార్లోనే కదా డ్రాప్ చేస్తానని తీసుకొని వెళ్తున్నానని అప్పు అంటుంది. మిమ్మల్ని చూస్తే జెలస్ గా ఉంది.. నా మొగుడు ఉన్నాడు ఎందుకని స్వప్న అంటుంది.
ఆ తర్వాత కావ్య ఆఫీస్ కి వెళ్తూ సీతారామయ్య టాబ్లెట్ ఇంకా ఇందిరదేవికి టాబ్లెట్ ఇచ్చి వెళ్తుంది. ఏంటి మా చెల్లి వెనకాల వెళ్లి మళ్ళీ వీడియో తీస్తావా అని రుద్రాణితో స్వప్న వెటకారంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత కావ్యని కలవడానికి రాజ్ ఆఫీస్ కి వెళ్ళాలనుకుంటాడు. నాకు పని ఉందని యామినితో చెప్తాడు. సరేనని యామిని పంపిస్తుంది. అదేంటి బేబీ అలా పంపించావని వైదేహి అడుగుతుంది. తనని ప్రేమ తో మన దార్లోకి తెచ్చుకోవాలని నువ్వే కదా చెప్పావని వైదేహీతో యామిని అంటుంది. మరి తాను ఎక్కడికి వెళ్ళాడో ఎలా తెలుస్తుందని వైదేహి అడుగుతుంది. తన కార్ కి జీపీఎస్ పెట్టాను.. దాని ద్వారా ఎక్కడికి వెళ్ళేది తెలుస్తుందని యామిని అంటుంది. ఆ తర్వాత కావ్య ఆఫీస్ కి వెళ్తుంది. ఎంప్లాయిస్ తన వంక అందరు బాధగా చూస్తుంటారు. రాజ్ సర్ మాకు ఇన్స్పిరేషన్ అంటూ రాజ్ గురించి చెప్తారు. మీరు వెళ్లి పని చేసుకోండని వాళ్ళతో కావ్య చెప్తుంది.
కావ్య తన క్యాబిన్ లో కూర్చొని బాధపడుతుంటే శృతి వచ్చి మాట్లాడుతుంది. ఆ తర్వాత రాజ్ కావ్యని కలవడానికి ఆఫీస్ కి వస్తాడు. ఆ విషయం జీపీఎస్ ద్వారా యామిని చూసి.. అదేంటీ రాజ్ ఆఫీస్ కి వెళ్ళాడని టెన్షన్ పడుతుంది. మరొక వైపు సీసీటీవీ ద్వారా రాజ్ రావడం చూసిన కావ్య రాజ్ లోపలికి రాకముందే తనే బయటకు వచ్చి రాజ్ ని పక్కకి తీసుకొని వెళ్తుంది. కావ్యకి రాజ్ బొకే ఇస్తాడు. తరువాయి భాగం లో రాజ్ లేడని అత్తయ్య చాలా బాధపడుతుందని కావ్యతో అప్పు అంటుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి వెళ్లి రాజ్ గతం మర్చిపోయాడు.. మీకు రేపు రాజ్ ని చూపిస్తానని కావ్య చెప్తుంది. అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |